మెస్సీకి సహకారం అందించాలి | Sakshi
Sakshi News home page

మెస్సీకి సహకారం అందించాలి

Published Sat, Jun 30 2018 4:29 AM

Argentina, France Hope to Reach Potential in World Cup Clash - Sakshi

ప్రపంచ కప్‌లో తొలి దశ డ్రామా ముగిసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ నిష్క్రమించగా, 16 అత్యుత్తమ జట్లు నాకౌట్‌ బరిలో నిలిచాయి. ఇప్పుడు అసలైన ఫుట్‌బాల్‌కు రంగం సిద్ధమైంది. అత్యుత్తమంగా ఆడినవారే ఇక్కడ నిలుస్తారు. ఈ దశలో కేవలం మంచి ఆట, వ్యూహాలు మాత్రమే సరిపోవు. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం కూడా చాలా ముఖ్యం. దీనిని తట్టుకోలేనివారు అందరికంటే ముందే బయటకు వెళ్లిపోతారు.  సాధారణంగా నాకౌట్‌ దశలో చూపు తిప్పుకోలేని విధంగా ఆట సాగుతుంది. ఈసారి కూడా అందులో లోటేమీ లేదు. టోర్నీ చివరి దశలో కాకుండా ముందే పెద్ద జట్ల మధ్య పోరు జరగనుంది.

ఫ్రాన్స్‌తో అర్జెంటీనా, ఉరుగ్వేతో పోర్చుగల్‌ తలపడటం అంటే భారీ వినోదానికి అవకాశం ఉంది. ఈ టోర్నీ ఆరంభంలో అర్జెంటీనా చాలా ఇబ్బంది పడింది. డిఫెన్స్‌ బలహీనత, మెస్సీపై అతిగా ఆధారపడటం, తుది జట్లు ఎంపికపై వివాదంలాంటి చాలా సమస్యలు వచ్చాయి. అయితే ఆఖరి మ్యాచ్‌లో సాహసోపేత ఆటతో పాటు అదృష్టం కూడా వారికి కలిసొచ్చింది. ఇప్పటికే నాకౌట్‌ మ్యాచ్‌ తరహా పరిస్థితిని ఎదుర్కోవడం ఒక రకంగా వారికి మంచిదే. అర్జెంటీనా ఒక జట్టుగా ఆడటం ఎంతో ముఖ్యం. మెస్సీ తన పరిధిలో ఎంత చేయగలడో అంతా చేస్తాడు కానీ ఇతర ఆటగాళ్లు కూడా తమ బాధ్యత నెరవేరిస్తేనే అర్జెంటీనాకు మంచి ఫలితం లభిస్తుంది.

Advertisement
Advertisement