వరల్డ్‌కప్‌ నుంచి ఆండ్రీ రసెల్‌ ఔట్‌ | Andre Russell ruled out of World Cup | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌ నుంచి ఆండ్రీ రసెల్‌ ఔట్‌

Jun 24 2019 8:15 PM | Updated on Jun 24 2019 8:17 PM

Andre Russell ruled out of World Cup - Sakshi

లండన్‌: మోకాలి గాయంతో బాధపడుతున్న వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ వరల్డ్‌కప్‌ నుంచి వైదొలిగాడు. వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభమైన నాటి నుంచి మోకాలి గాయంతో పదే పదే మ్యాచ్‌లకు దూరమవుతున్న రసెల్‌ టోర్నీ నుంచి తప్పుకున్న విషయాన్ని విండీస్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది.  ఈ టోర్నీలో కేవం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రసెల్‌.. 36 పరుగులు మాత్రే చేసి ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. 

ఇంకా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉన్న విండీస్‌.. సెమీస్‌ అవకాశాలపై ఆశలు పెట్టుకోవాలంటే అన్నింటా గెలవాలి. ఈ తరుణంలో ఆండ్రీ రసెల్‌ జట్టుకు దూరం కావడం విండీస్‌కు ఎదురుదెబ్బే. రసెల్‌ స్థానంలో సునీల్‌ అంబ్రిస్‌ను ఎంపిక చేస్తూ విండీస్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీలో విండీస్‌ ఇప్పటివరకూ మ్యాచ్‌ మాత్రమే గెలవగా, ఆ జట్టు ఆడాల్సిన ఒక మ్యాచ్‌ రద్దయ్యింది. దాంతో విండీస్‌ ఖాతాలో మూడు పాయింట్లు మాత్రమే ఉన్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement