ఆంధ్ర జట్టుకు ఆధిక్యం | Andhra Team Won First Innings Lead In Ranji Trophy Cricket Group A League Match | Sakshi
Sakshi News home page

ఆంధ్ర జట్టుకు ఆధిక్యం

Dec 19 2019 1:28 AM | Updated on Dec 19 2019 1:28 AM

Andhra Team Won First Innings Lead In Ranji Trophy Cricket Group A League Match - Sakshi

రికీ భుయ్‌

సాక్షి, ఒంగోలు టౌన్‌: మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ రికీ భుయ్‌ (70 బ్యాటింగ్‌; 8 ఫోర్లు)తోపాటు కెప్టెన్ హనుమ విహారి (38; 6 ఫోర్లు), మనీశ్‌ (42; 7 ఫోర్లు), కరణ్‌ షిండే (48; 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడటంతో... ఢిల్లీతో  ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్‌ గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 16/2తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో 6 వికెట్లకు 249 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆంధ్ర ఖాతాలో 34 పరుగుల ఆధిక్యం ఉంది. రికీ భుయ్‌కు తోడుగా గిరినాథ్‌ రెడ్డి (11 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ఢిల్లీ బౌలర్లలో నవదీప్‌ సైని మూడు వికెట్లు, పవన్‌ రెండు వికెట్లు తీశారు.   

Advertisement
 
Advertisement
Advertisement