జన్మదినం రోజున ముంబై మాస్టర్ తోనే: నాగార్జున | Akkineni Nagarjuna to spend birthday cheering for his Indian Badminton League team | Sakshi
Sakshi News home page

జన్మదినం రోజున ముంబై మాస్టర్ తోనే: నాగార్జున

Aug 28 2013 1:30 PM | Updated on Jul 21 2019 4:48 PM

జన్మదినం రోజున ముంబై మాస్టర్ తోనే: నాగార్జున - Sakshi

జన్మదినం రోజున ముంబై మాస్టర్ తోనే: నాగార్జున

తన జన్మదినం రోజున ముంబై మాస్టర్ జట్టును పోత్సాహిస్తూ గడపాలనుకుంటున్నట్టు టాలీవుడ్ హీరో నాగార్జున వెల్లడించారు.

తన జన్మదినం రోజున ముంబై మాస్టర్ జట్టును పోత్సాహిస్తూ గడపాలనుకుంటున్నట్టు టాలీవుడ్ హీరో నాగార్జున వెల్లడించారు. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, వ్యాపారవేత్త చాముండేశ్వర నాథ్ ల భాగస్వామ్యంతో నాగార్జున ఐబీఎల్ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  తన జన్మదినం రోజున బెంగుళూరులో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో తన జట్టకు ప్రోత్సాహిస్తూ గడుపుతానని తెలిపారు. 
 
ఇటీవల కాలంలో భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ తో కలిసి మహీ రేసింగ్ జట్టుకు సహచర భాగస్వామిగా ఉన్నాడు. ఈ సంవత్సరం తాను కొనుగోలు చేసిన జట్లు రాణించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోంది అని నాగార్జున అన్నారు. 
 
త్వరలో ముగిసే రేసింగ్ లీగ్ లో తమ జట్టు అగ్రస్థానంలో ఉందని, బాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్ జట్టు సెమీ ఫైనల్ కు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఇలాగే తన జట్లు విజయపథంలో ప్రయాణించాలని కోరుకుంటున్నానని నాగార్జున తెలిపారు. 
 
 ఆగస్టు 29 నాగార్జున జన్మదినం జరుపుకోనున్న నాగార్జున చిత్ర రంగంలోనూ, క్రీడారంగంలో బిజీగా ఉన్నారు. త్వరలోనే నాగార్జున నటించిన భాయ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఆస్థాయిలో ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)కు క్రేజ్ లభిస్తున్న సంగతి తెలిసిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement