రేపు అజ్మల్ బౌలింగ్ కు పరీక్ష | Ajmal action to be tested on Monday | Sakshi
Sakshi News home page

రేపు అజ్మల్ బౌలింగ్ కు పరీక్ష

Aug 24 2014 6:35 PM | Updated on Nov 6 2018 8:50 PM

పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ ను సోమవారం పరీక్షించనున్నారు

దుబాయ్ : పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ ను  సోమవారం పరీక్షించనున్నారు. అజ్మల్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడంటూ  ఫిర్యాదు అందడంతో అతని బౌలింగ్ యాక్షన్ ను ఐసీసీ రేపు పరిశీలించనుంది.శ్ రీలంకతో గాలెలో జరిగిన తొలి టెస్టులో అజ్మల్ బౌలింగ్ యాక్షన్ పై ఆరోపణలు వచ్చాయి.
 

శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా పాక్ స్పిన్నర్ వేసిన చాలా బంతుల్నిసందేహాస్పదంగా పరిగణిస్తున్నట్టు మ్యాచ్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆనాటి మ్యాచ్ లో అతను వేసే దూస్రా బంతుల్నిఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. 2009 లో అజ్మల్ బౌలింగ్ శైలిపై సందేహాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement