బంగ్లా పర్యటన తర్వాతే స్పష్టత | After a tour of the Bangla resolution | Sakshi
Sakshi News home page

బంగ్లా పర్యటన తర్వాతే స్పష్టత

Jun 7 2015 1:31 AM | Updated on Sep 3 2017 3:19 AM

బంగ్లాదేశ్ పర్యటన అనంతరం భారత క్రికెట్ జట్టుతో తన కొనసాగింపుపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి...

టీమ్ డెరైక్టర్ పదవిపై రవిశాస్త్రి

 న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ పర్యటన అనంతరం భారత క్రికెట్ జట్టుతో తన కొనసాగింపుపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘ప్రస్తుతానికైతే నేను జట్టుతో పాటే ఉన్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది బోర్డుతో సమావేశమై చర్చించాక తెలుస్తుంది. ఇప్పుడు ఆ విషయం గురించి నేనేమీ ఆలోచించడం లేదు. నా దృష్టంతా బంగ్లా పర్యటన మీదే ఉంది. కోహ్లి నా గురించి మాట్లాడిన విధానం బాగుంది. విరాట్ ఏదైనా సూటిగానే మాట్లాడుతాడు. జట్టులోని ఆటగాళ్లంతా నిజాయితీగా ఉంటారు. 35 ఏళ్ల నుంచి బోర్డుతో అనుబంధం కొనసాగుతోంది. ఈ కాలంలో చాలామంది అధ్యక్షులు మారారు. నేనందరితోనూ బాగానే ఉన్నాను’ అని రవిశాస్త్రి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement