ప్రపంచకప్‌ ఫైనల్స్‌ టోర్నీకి సురేఖ–అభిషేక్‌ జంట  | Abhishek Verma, Jyothi Surekha stay in medal hunt | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ ఫైనల్స్‌ టోర్నీకి సురేఖ–అభిషేక్‌ జంట 

Jul 24 2018 12:52 AM | Updated on Jul 24 2018 12:52 AM

Abhishek Verma, Jyothi Surekha stay in medal hunt - Sakshi

ఆర్చరీ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అర్హత సాధించింది. భారత్‌కే చెందిన అభిషేక్‌ వర్మతో కలిసి సురేఖ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో బరిలోకి దిగనుంది.

సీజన్‌లో జరిగిన నాలుగు ప్రపంచకప్‌లలో (షాంఘై, అంటాల్యా, సాల్ట్‌లేక్‌ సిటీ, బెర్లిన్‌) సురేఖ–అభిషేక్‌ జంట నిలకడగా రాణించి నాలుగు కాంస్య పతకాలు గెలిచింది. తద్వారా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి తొలిసారి అర్హత పొందింది. ఈ మెగా ఈవెంట్‌ సెప్టెంబరు 29, 30 తేదీల్లో టర్కీలోని సామ్‌సన్‌ నగరంలో జరుగుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement