రహానె హాఫ్ సెంచరీ | 2nd odi against southafrica; India batting | Sakshi
Sakshi News home page

రహానె హాఫ్ సెంచరీ

Oct 14 2015 3:02 PM | Updated on Sep 3 2017 10:57 AM

దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ తడబడుతోంది. బుధవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ 20 ఓవరల్లో 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.

ఇండోర్: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ టాపార్డర్ తడబడినా రహానె హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకుంటున్నాడు. బుధవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ 22 ఓవరల్లో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. రహానే (51 నాటౌట్), ధోనీ (9 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు. రహానే 6 ఫోర్లు బాదాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ధోనీసేన ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 3 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (3) రబడా బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత ధవన్, రహానె జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. కాసేపటి తర్వాత ధవన్(23).. మోర్కెల్ బౌలింగ్లో అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపో్యాడు. జట్టు స్కోరు 82 పరుగుల వద్ద కోహ్లీ (12) రనౌటయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement