నీ పెళ్లేరా బాబు.. కాస్త ఇటు చూడు | Viral Video Groom Plays PUBG At Own Wedding As Clueless Wife Stares At Him | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలపై పబ్‌జీ ఆడుతోన్న వరుడు

Apr 29 2019 8:14 PM | Updated on Apr 29 2019 8:27 PM

Viral Video Groom Plays PUBG At Own Wedding As Clueless Wife Stares At Him - Sakshi

చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. జీబీల కొద్ది అన్‌లిమిటెడ్‌ డాటా లభ్యమవుతున్న కాలంలో చుట్టూ ఎందరు ఉన్నా ఒంటరిగానే.. తనదైన లోకంలో కాలం గడుపుతున్న రోజులివి. వీటికి తోడు కొత్తగా పుట్టుకువచ్చే ఆనలైన్‌ గేమ్స్‌ నిజంగానే మనిషిని ఒంటరి చేస్తున్నాయి. ఈ కోవకు చెందినదే పబ్‌జీ గేమ్‌. నిద్రాహారాలు మానేసి మరి దీనికి బానిసలవుతున్నారు యువత. ఎంతలా అంటే ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియో ఓ వివాహ వేడుకకు సంబంధించినది. పెళ్లింట ఎంత కోలాహలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అవేవీ ఈ పెళ్లి కొడుకుని డిస్టర్బ్‌ చేయలేకపోయాయి. అక్కడ జరుగుతుంది తన పెళ్లే అని.. తాను మండపంలో ఉన్నానని.. పక్కన పెళ్లి కూతురు కూడా ఉందనే విషయాలేవి పట్టించుకోకుండా.. తన స్మార్ట్‌ఫోన్‌లో పబ్‌జీ ఆడటంలో బిజీ అయిపోయాడు పెళ్లి కొడుకు. పెళ్లికి వచ్చిన బంధువులు బహుమతులు ఇవ్వబోతే వాటిని కూడా పక్కకు తోసేశాడు. కారణం వాటి వల్ల తనకు మొబైల్‌ స్క్రీన్‌ కనిపించక ఆట డిస్టర్బ్‌ అవుతుందని.

ఓ పక్క పెళ్లి కొడుకు ఇంత ఏకాగ్రతతో పబ్‌జీ ఆటడంలో మునిగిపోతే.. పాపం పెళ్లి కూతురు ఏమి అనలేక అలా నిస్పహాయంగా చూస్తూ.. అతగాడేప్పుడు బయట ప్రపంచంలోకి వస్తాడా అని ఎదురు చూస్తుంది. అయితే ఇది నిజంగానే జరిగిందా.. లేక టిక్‌టాక్‌ కోసం కావాలనే తీసిన వీడియోనా అనే విషయం తెలియలేదు. కానీ ఈ వీడియో చూసినవారంతా.. బాబు అక్కడ జరిగేది నీ పెళ్లేరా.. కాస్తా ఆ ఫోన్‌ పక్కన పెట్టు అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement