శ్మశానంలో సాహసం : దెయ్యం రాకతో హడల్‌

Ghost Chases Man In Graveyard - Sakshi

హాంట్స్‌, ఇంగ్లండ్‌ : 800 ఏళ్ల పురాతన శ్మశానంలో సాహసయాత్రకు వెళ్లిన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌కు షాక్‌ తగిలింది. ఓ దెయ్యం వెంబడించటంతో అతను హడలిపోయాడు. దెయ్యం తనపై దాడికి వస్తున్న ఘటనను టోని ఫెర్గూసన్‌ వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

హాంట్స్‌లో సెయింట్‌ మెరీ చర్చ్‌ వద్ద ఏదో ఉందని పుకార్లు వస్తుండటంతో ఫెర్గూసన్‌ అక్కడకు వెళ్లాడు. శ్మశాన పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తుండగా ఉన్నట్లు ఉండి ఓ ఆత్మ అతనిపైకి వచ్చింది. ఈ ఘటనతో ఫెర్గూసన్‌ నిర్ఘాంతపోయాడు. వెంటనే అక్కడి నుంచి వచ్చేశాడు. పూర్వీకులకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చే వారిని ఈ దెయ్యమే భయపెడుతున్నట్లు చెప్పాడు.

అయితే, ఫెర్గూసన్‌ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది ఎడిటెడ్‌ వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top