ఈ ఫొటోలో చిరుత ఎక్కడుందో గుర్తు పట్టగలరా?

Can You Find Snow Leopard In This Viral Photo Clicked In Himachal Pradesh - Sakshi

న్యూఢిల్లీ : వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ సౌరభ్‌ దేశాయ్‌ తీసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని స్పిటి వ్యాలీని సందర్శించిన సందర్భంగా కొండపై నక్కి ఉన్న మంచు చిరుతను ఆయన తన కెమెరాలో బంధించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను..‘ ఆర్ట్‌ ఆఫ్‌ కమోఫ్లాగ్‌’ (నిగూఢమైన)పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇక ఈ ఫొటోలో దాగి ఉన్న చిరుతను పట్టుకునేందుకు నెటిజన్లు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ చాలా మంది దాని జాడను కనిపెట్టలేకపోతున్నారు.

ఈ క్రమంలో ‘ మ్యాన్‌.. ఈ ఫొటోను ఎప్పటి నుంచో తీక్షణంగా చూస్తున్నా. కానీ చిరుత దొరకడం లేదు. అది ఎక్కడుందో తెలుసునే దాకా నిద్ర పట్టేలా లేదు’ అంటూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఏంటీ.. మీరు కూడా చిరుత కోసం వెదుకుతున్నారా. దొరకలేదా..? మరేం పర్లేదు.... మీ శ్రమను తగ్గించేందుకు.. మంచు చిరుతను ‘పట్టుకున్న’ ఓ నెటిజన్‌ షేర్‌ చేసిన ఫొటోను మీకోసం అందిస్తున్నాం.

కాగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిబ్బర్‌ గ్రామంలో సౌరభ్‌ దేశాయి ఈ ఫొటోను తీశారు. ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటేన్‌గా పిలుచుకునే మంచు చిరుతలు భూమి నుంచి దాదాపు 9800 నుంచి 17 వేల అడుగుల ఎత్తున కనిపిస్తాయి. కిబ్బర్‌ వైల్డ్‌ లైఫ్‌ సాంక్చువరీ, కిన్నార్‌ జిల్లాలో ఇవి అప్పుడప్పుడూ సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top