వైరల్‌ : వీడియో చూస్తూ.. అలా ఉండిపోతారంతే..!

Anand Mahindra Amazes 4 Years Iranian Boy Impressive Football Gaming - Sakshi

పిల్లలు అల్లరి చేసినప్పుడు.. పిల్లలు కాదు బాబోయ్‌ పిడుగులు..! అని విసుక్కుంటాం. వారు ఏదైనా పని అద్భుతంగా చేసినప్పుడు పిల్లలు కాదు చిచ్చరపిడుగులు అని అంటుంటాం. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మహింద్రా అండ్‌ మహింద్రా కంపెనీ యజమాని ఆనంద్‌మహింద్రా ఓ వీడియో చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వావ్‌ అంటూ ఒకింత ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫుట్‌బాల్‌తో సకల విన్యాసాలు చేస్తున్న చిన్నారి జట్టుని చూసి తొలుత అమ్మాయి అని భావించానని.. కానీ, అబ్బాయి అని తెలిసిందని చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల ఈ ఇరానీయన్‌ కుర్రాడి విన్యాసాలు అద్భుతం అంటూ ఆనంద్‌ ఆయన చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇక మైదానంలో ప్రత్యర్థి అంచనాలకు అందకుండా.. పాదరసంలా కదులుతూ ఈ బుడతడు గోల్‌ చేసిన తీరు, కాలితో బంతిని అలా ఓ 30 సెకన్ల పాటు గాల్లోనే ఉంచడం.. చూడకుండా బాస్కెట్‌లో బంతిని వేయడం, నెట్స్‌లో చురుకైన సాధన అతని ప్రతిభకు నిదర్శనం. ‘భవిష్యత్‌లో గొప్ప ఫుట్‌బాలర్‌ అవుతావ్‌’ అంటూ.. నెటిజన్లు చిన్నారిపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top