‘చంద్రబాబు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు’ | YSRCP Leader Iqbal Fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు’

Mar 3 2019 4:23 PM | Updated on Mar 3 2019 4:35 PM

YSRCP Leader Iqbal Fires on Chandrababu Naidu - Sakshi

హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత ఇక్బాల్‌ విమర్శించారు. అనైతిక, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేందుకు ఆయన కుమారుడు లోకేశ్‌ను ఐటీ శాఖలో చంద్రబాబు ఉంచారన్నారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బాబు యత్నిస్తున్నారన్నారు. కావాలనే వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లను ఏపీ ప్రభుత్వం తొలగిస్తుందని మండిపడ్డారు. టీడీపీ అక్రమంగా ఎన్నికల్లో గెలవాలని యత్నిస్తోందన్నారు. అసలు ఏపీ లబ్ధిదారుల డేటాను ఐటీ గ్రిడ్‌ కంపెనీకి ఎలా ఇస్తారని ఇక్బాల్‌ ప్రశ్నించారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement