చంద్రబాబు తగిన గుణపాఠం చెప్పారు: భూమన | YSRCP Leader Bhumana Karunakar Reddy Fair On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తగిన గుణపాఠం చెప్పారు: భూమన

Dec 13 2018 8:27 PM | Updated on Dec 13 2018 8:34 PM

YSRCP Leader Bhumana Karunakar Reddy Fair On Chandrababu Naidu - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న భూమన కరుణాకర్‌ రెడ్డి

సాక్షి, చిత్తూరు: చంద్రబాబు నాయుడు ఏపీలో అక్రమంగా సంపాదించిన కొట్ల రూపాయలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. గురువారం తిరుపతిలో గాలి వీధిలో రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు తెలంగాణలో అడ్డదారిలో అధికారంలోకి రావాలని చూసారు.

కానీ తెలంగాణా ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వచ్చే 2019లో ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూడా బాబుకు తగిన బుద్ధి చెపుతారని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని  ఈ సందర్భంగా భూమన అన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement