
సాక్షి, గన్నవరం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం వైఎస్ జగన్ 159వ రోజు పాదయాత్రను గన్నవరం శివారు నుంచి ప్రారంభించారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ రాజన్న బిడ్డ ముందుకు సాగుతున్నారు. అక్కడి నుంచి మండవల్లి, చిగురుకోట క్రాస్ మీదుగా భైరవపట్నం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.]
పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. అనంతరం చావలిపాడు మీదుగా కైకలూరు వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. కైకలూరు గాంధీబొమ్మ సెంటర్ జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. జననేత అడుగులో అడుగు వేసేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు.