కాళేశ్వరానికి జాతీయహోదా అడగరేం? | What is the National Honor's Admission for Kaleshvara? | Sakshi
Sakshi News home page

కాళేశ్వరానికి జాతీయహోదా అడగరేం?

Oct 7 2017 2:18 AM | Updated on Oct 30 2018 7:50 PM

What is the National Honor's Admission for Kaleshvara? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదాకోసం ఎందుకు ప్రయత్నించడం లేదని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టుకు రీ డిజైన్‌ పేరిట తూట్లు పొడిచారని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుద్వారా ఖర్చును పెంచడానికే ప్రాణహితకు రీ డిజైన్‌ చేశారని, దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించదనే కారణంతోనే జాతీయహోదాకోసం సీఎం కేసీఆర్‌ ప్రయత్నించడం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement