ఢిల్లీకి టీడీపీ గులాం | Vinod kumar commented over tdp | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి టీడీపీ గులాం

Nov 2 2018 1:41 AM | Updated on Mar 18 2019 9:02 PM

Vinod kumar commented over tdp - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, ఏపీ ప్రజలను టీడీపీ మోసం చేస్తున్నాయని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ విమర్శిం చారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు భేటీ అయ్యారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బాబు ఢిల్లీకి తాకట్టు పెట్టడానికే అక్కడికి వెళ్లారని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులకు ఇప్పటివరకు హైదరాబాద్‌లో టికెట్లు ఇచ్చేవారని, ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీకి చేరిందన్నారు. కాంగ్రెస్‌కు ఢిల్లీలో బాసులు ఉంటారని, ఇప్పుడు టీడీపీ ఢిల్లీకి గులాం అయిందన్నారు. ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషించేలా బాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.

వారి భేటీ.. మరో ఓటుకు నోటు: టీఆర్‌ఎస్‌
సాక్షి, హైదరాబాద్‌: రాహుల్, చంద్రబాబు భేటీ మరో ఓటుకు నోటు కేసు అని, అది బయటపడింది.. ఇది పడలేదు అంతే తేడా అని టీఆర్‌ఎస్‌ పార్టీ ధ్వజమెత్తింది. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ కార్యదర్శి గట్టు రామచంద్రరావు, టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడారు.

కాంగ్రెస్‌–టీడీపీల పొత్తు అపవిత్రమైనదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వేదికగా తెలం గాణపై కబ్జాకు దిగుతున్నారని ఆరోపించారు. టీటీడీపీ నేతలు లేకుండానే రాహుల్‌తో బాబు ఎలా భేటీ అవుతారని ప్రశ్నిం చారు. దీంతో టీటీడీపీ నేతల బానిస మనస్తత్వం బయటపడిందని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement