‘మాల్యా నుంచి చంద్రబాబు విరాళం’ | vijayasai reddy takes on chandrababu naidu over delhi tour | Sakshi
Sakshi News home page

‘విజయ్‌ మాల్యా నుంచి చంద్రబాబు విరాళం’

Apr 2 2018 1:59 PM | Updated on Apr 6 2019 9:07 PM

vijayasai reddy takes on chandrababu naidu over delhi tour - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం చంద్రబాబుపై రాజ్యసభ చైర్మన్‌కు ప్రివిలేజ్‌ మోషన్‌ నోటీసులు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... యూటర్న్‌ అంకుల్‌ చంద్రబాబు ఎందుకు ఢిల్లీకి వస్తున్నారన్నారు. గతంలో అన్ని పార్టీలతో జతకట్టి.. తర్వాత అందరినీ వదిలిపెట్టిన చంద్రబాబు మళ్లీ పార్టనర్‌ కోసం ఢిల్లీకి వస్తున్నారా అని నిలదీశారు. చంద్రబాబు దుర్మార్గ పాలనను ప్రజలు మర్చిపోరని తెలిపారు. ఓటుకు నోట్లు కేసుతో పాటు కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌, రాజధాని నిర్మాణం, పోలవరం పనుల్లో చంద్రబాబు లక్ష కోట్లకు పైగా స్కామ్‌లు చేశారని ఆరోపించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరిగిన స్కాం లపై అన్నీపార్టీల నేతలు కేంద్ర నాయకత్వాలకు తెలిపాలన్నారు.

మరో వైపు 2016, మార్చిలో 12,13,14 తేదీల్లో చంద్రబాబు నాయుడు లండన్‌కు వెళ్లి లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాను కలిశారా? లేదా?.. మాల్యా దేశం వదిలి పారి పోయిన 10 రోజులకు మీరు కలవలేదా?.. గత ఎన్నికల కోసం మాల్యా నుంచి రూ.150 కోట్ల విరాళం తీసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. మాల్యా నుంచి తీసుకున్న విరాళాలపై చంద్రబాబు జవాబు చెప్పాలని, లేనిపక్షంలో అవన్నీ వాస్తవాలు అనుకోవాల్సి వస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement