నవ్వుతున్నారు... థూ.. అని ఊస్తున్నారు! | Vijayasai Reddy Slams Chandrababu Over His Comments | Sakshi
Sakshi News home page

ఎవరిచ్చారు మీకీ అధికారం; కనీస స్పృహలేదు!

Oct 17 2019 10:45 AM | Updated on Oct 17 2019 2:56 PM

Vijayasai Reddy Slams Chandrababu Over His Comments - Sakshi

సాక్షి, అమరావతి : ఎక్కడికి వెళ్లినా కమెడియన్‌ తరహాలో కార్యకర్తలను ఆహ్లాదపరచడంపైనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్లు ఉన్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరిచ్చారు మీకీ అధికారం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. పదే పదే శోకాలు పెట్టడం తప్ప... ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించరాదనే కనీస సృహ కూడా ఆయనకు లేదని విమర్శించారు.

తుపుక్కున ఊస్తున్నారు...
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసా లబ్దిదారులు జాబితా వెలువడి గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు పొందిన తెలుగుదేశం కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక.. పులివెందుల పంచాయతీ, జె-ట్యాక్స్ అని చంద్రబాబు ఏడుపు రాగాలు తీస్తున్నారని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో ఆయన మాటలపై తుపుక్కుమని ఊస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement