‘ఆ విషయాన్ని పత్రికలు చిన్నదిగా చేసి రాశాయి’ | Vijay Sai Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ట్రెయినింగ్ అలా ఉంటుంది’

Feb 16 2020 11:27 AM | Updated on Feb 16 2020 11:35 AM

Vijay Sai Reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన వద్ద శిక్షణ తీసుకున్న కొందరు దోపిడీదారులు ఇతరులపై నిందలు మోపుతూ, మరోవైపు నీతి సూక్తులు వల్లిస్తున్నారని విమర్శించారు.‘దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి. చంద్రబాబు ట్రెయినింగ్ అలాగే ఉంటుంది. దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు. అందరిపైనా వారే నిందలు మోపుతూ, చూశారా మేమొండిన పరమాన్నం ఇంకా చల్లారనే లేదని నీతి సూక్తులు వల్లిస్తుంటారు’ అని ట్వీట్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు క్యాట్‌ నిరాకరించిందన్న విషయాన్ని ఎల్లోమీడియా చిన్నదిగా చేసి రాశాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. డీజీపీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తారా అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు బ్యాచ్ ఇప్పుడు కిక్కురుమనడం లేదని ఎద్దేవా చేశారు. ‘ ఏబీవీ సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. డిజిపి స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తారా అని గగ్గోలు పెట్టిన బాబు బ్యాచ్ కిక్కురుమనడం లేదు. ఎప్పటిలాగే ఎల్లో మీడియా తమ జాతి రత్నాన్ని వెనకేసుకొచ్చింది. స్టే దొరకలేదనే విషయాన్ని పత్రికల్లో చిన్నదిగా చేసి రాశాయి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement