గుజరాత్‌ ముఖ్యమంత్రిగా రూపానీ ప్రమాణం

Vijay Rupani Takes Oath As Gujarat Chief Minister - Sakshi

గాంధీనగర్‌ : గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ(61) ప్రమాణ స్వీకారం రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, డిప్యూటి ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీలు కూడా విచ్చేశారు.

కాగా, మంగళవారం ఉదయం భార్య అంజలితో కలసి విజయ్‌రూపానీ అక్షరధామ్‌ దేవాలయాన్ని సందర్శించారు. రూపానీ తర్వాత నితీశ్‌ పటేల్‌ మరోమారు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రూపానీతో పాటు 19 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల వివరాలను కింది ఫొటోలో చూడొచ్చు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top