తెలంగాణ తెచ్చాననడం హాస్యాస్పదం: వీహెచ్‌ | V hanumantha rao comments over kcr | Sakshi
Sakshi News home page

తెలంగాణ తెచ్చాననడం హాస్యాస్పదం: వీహెచ్‌

Oct 15 2018 2:53 AM | Updated on Sep 19 2019 8:28 PM

V hanumantha rao comments over kcr - Sakshi

పటాన్‌చెరు టౌన్‌: తెలంగాణ తానే తెచ్చానని కేసీఆర్‌ చెప్పుకోవడం హాస్యాస్పదం అని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఎంతో మంది ఆత్మార్పణ చేసుకోవడంతో.. వారి ఆవేదనను గుర్తించిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా వారు ఉన్నారన్నారు. 

కేసీఆర్‌ని వాలీబాల్‌ ఆడినట్లు ఆడుకుందాం: కోమటిరెడ్డి
నల్లగొండ: తన ఎమ్మెల్యే పదవిని రద్దు చేసిన కేసీఆర్‌ను వాలీబాల్‌ ఆడినట్లు ఆడుకోవాలని మార్నింగ్‌ వాకర్స్‌ను సీఎల్పీ మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఆది వారం ఉదయం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్‌లో ఆయన మార్నింగ్‌ వాకర్స్‌తో కలిసి జాగింగ్‌ చేశారు. వాలీబాల్, క్రికెట్‌ ఆడి సందడి చేశారు. అనంతరం పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాల్లో మాట్లాడారు. తాను అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తిని కాద ని, యాదాద్రి పవర్‌ ప్లాంట్‌తో జిల్లా ప్రజలకు ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్పానన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement