ఊర్మిళ ఆస్తులు రూ. 68 కోట్లు | Urmila Matondkar has Rs 68 crore assets | Sakshi
Sakshi News home page

ఊర్మిళ ఆస్తులు రూ. 68 కోట్లు

Apr 9 2019 4:49 AM | Updated on Apr 9 2019 4:49 AM

Urmila Matondkar has Rs 68 crore assets - Sakshi

ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్‌ నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి, నటి ఊర్మిళ మటోండ్కర్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తనకు రూ.68.28 కోట్ల ఆస్తులు(మార్కెట్‌ విలువ మేరకు) ఉన్నట్లు ఊర్మిళ తెలిపారు. ఇందులో రూ.40.93 కోట్ల చరాస్తులు ఉండగా, రూ.27.34 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. 2013–14 ఆర్థిక సంవత్సరానికి రూ.1.27 కోట్ల ఆదాయాన్ని అర్జించినట్లు పేర్కొన్నారు. 2017–18 నాటికి తన ఆదాయం రూ.2.85 కోట్లకు చేరుకుందన్నారు. అలాగే తన భర్త పేరుపై రూ.32.35 కోట్ల చరాస్తులు, రూ.30 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement