ఆర్టీసీ సమ్మె : ‘మంత్రి హరీశ్‌కు నిరసన సెగ

TSRTC Strike : Employees Protest At Minister Harish Rao Bike Rally - Sakshi

సాక్షి, సంగారెడ్డి : ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె సెగ తగిలింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం బీరంగూడ పరిధిలోని రహదారి, రిజర్వాయర్‌ శంకుస్థాపనకు మంత్రి హరీశ్‌ ఆదివారం వచ్చారు. ఈనేపథ్యంలో కార్యకర్తలు, స్థానిక నాయకులతో కలిసి ఆయన బైక్‌లపై ర్యాలీగా బీరంగూడ కమాన్ దాటుతుండగా ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్‌ రావు ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top