
సాక్షి, కర్నూలు : జిల్లాలోని దేవనకొండలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో ఉన్న దాదాపు 300 కుటుంబాలు మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరాయి. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. మరోవైపు జీతాలు పెంచడంతో వైఎస్సార్ క్రాంతి ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన మహా నాయకుడు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి మంత్రి అభినందనలు తెలిపారు.