కిషన్‌రెడ్డి పర్యటన.. ఫ్లెక్సీలు తగలబెట్టడంతో ఉద్రిక్తత

Tension in Asif Nagar During Kishan Reddy Tour - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలోని ఆసిఫ్‌నగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. కిషన్‌రెడ్డి ఆదివారం ఆసిఫ్‌నగర్‌లో పర్యటిస్తున్న సమయంలో.. ఓ యువకుడు ఆయన ఫ్లెక్సీలను తగలబెట్టాడు. దీంతో పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కిషన్‌రెడ్డి ఫ్లెక్సీలను తగలబెట్టిన యువకుడిని పట్టుకొని బీజేపీ శ్రేణులు చితకబాదాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top