రెండో రోజు 82 | Telangana ZPTC And MPTC Nominations | Sakshi
Sakshi News home page

రెండో రోజు 82

Apr 24 2019 1:17 PM | Updated on Apr 24 2019 1:17 PM

Telangana  ZPTC And MPTC Nominations - Sakshi

చేవెళ్ల: మల్కాపూర్‌ ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ వేస్తున్న యాదిరెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలిదశ స్థానిక పోరు జరిగే ఏడు మండలాలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. రెండో రోజైన మంగళవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖలులో కాస్త ఊపు కనిపించింది. 82 నామినేషన్లు రిటర్నింగ్‌ అధికారులకు అందాయి. 96 ఎంపీటీసీ స్థానాలకు 76, ఏడు జెడ్పీటీసీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. షాబాద్‌ జెడ్పీటీసీకి కాంగ్రెస్‌ అభ్యర్థితోపాటు మరో ఇద్దరు స్వతంత్రులు నామినేషన్లు సమర్పించారు.

మొయినాబాద్‌ జెడ్పీటీసీకి టీఆర్‌ఎస్‌ తరఫున ఒకరు, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీకి కాంగ్రెస్‌ నుంచి మరొకరు నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు అందజేశారు. మొత్తం మీద రెండు రోజుల్లో కలిపి ఏడు జెడ్పీటీసీలకు తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిదశ ఎన్నికలు జరిగే 96 ఎంపీటీసీలకు 76 మంది అభ్యర్థులు 77 నామినేషన్లు వేశారు. మొదటి, రెండో రోజు కలుపుకుంటే నామినేషన్ల సంఖ్య 115కు చేరుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement