భారీ గిఫ్ట్‌.. ఇవ్వాల్సిందే | TDP MLA Satyaprabha Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

భారీ గిఫ్ట్‌.. ఇవ్వాల్సిందే

Mar 20 2019 7:41 AM | Updated on Mar 23 2019 8:59 PM

TDP MLA Satyaprabha Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, చిత్తూరు :ఎన్నికలు రావడంతో ‘గిఫ్ట్‌’ సమర్పించుకోవాలని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభను పార్టీ అధిష్టానం ఆదేశించడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎంపీగా పోటీ చేసేందుకు ఆమె మొండికేసినా పాత చిట్టాలు వెలికి తీయడంతోపాటు ఓ బంగ్లా వివాదాన్ని తెరపైకి తెచ్చి గుర్తు చేశారట. దీంతో ఇక తప్పనిసరై ఆమె బరిలోకి దిగారని ఆ పార్టీ నేతలు గుసగుసలుపోతున్నారు. చిత్తూరు అసెంబ్లీ సీటును త్యాగం చేసి.. రాజంపేట ఎంపీ సీటు నుంచి బరిలో నిలవాల్సొచ్చిందని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల ఖర్చు భరించడంతోపాటు చంద్రగిరి ఎన్నికల ఖర్చు కూడా భరించాలని షరతు విధించారట. బాబు తీరుతో లోలోన రగిలిపోతూనే పైకి నవ్వుతూ నటించాల్సి వస్తోందని ఆమె అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement