‘పవన్‌ నియమించిన ప్రతినిధుల్లో ఇద్దరు బీజేపీ నేతలు’ | TDP Leader Varla Ramaiah mocks Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘పవన్‌ నియమించిన ప్రతినిధుల్లో ఇద్దరు బీజేపీ నేతలు’

Mar 25 2018 6:22 PM | Updated on Mar 22 2019 5:33 PM

TDP Leader Varla Ramaiah mocks Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ నేతల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్‌కు రాజకీయ అవగాహన లేదని విమర్శించారు.

పవన్‌ నియమించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల్లో ఇద్దరు బీజేపీ నాయకులు ఉన్నారని, వారు బీజేపీ చెప్పింది వింటారు కానీ పవన్‌ మాట వినరని ఆయన అన్నారు. గతంలో ప్రజారాజ్యం​పార్టీ స్థాపించిన చిరంజీవి కొన్ని సీట్లు అయినా సాధించగలిగారని, కానీ పవన్‌ మాత్రం అంతకుముందే దుకాణం సర్దేస్తారని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement