
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటమే తమ ఎజెండా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విద్యార్థుల పరీక్షలు, పార్టీ ప్లీనరి కారణంగా కొంత కాలం ఉద్యమానికి విరామం ఇచ్చామని అన్నారు.
ఇకపై ఇదే అంశంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని రఘురాం చెప్పారు. కాగా, వైఎస్ జగన్ అధ్యక్షతన ఎంవైఆర్ కళ్యాణ మండపంలో యువభేరి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.