
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో టీడీపీకి మరో గట్టిషాక్ తగిలింది. కడపకు చెందిన టీడీపీ సీనియర్ మైనార్టీ నేత, మాజీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సుబాన్ బాషా శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ల తీరు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుబాన్ బాషాతో తరలివచ్చిన ఆయన అనుచరులకు అంజద్ బాషా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆ పార్టీని వీడి తన కుటుంబ సభ్యులు, పలువురు నేతలు, కార్యకర్తలతో బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పాటు టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న సతీష్ రెడ్డి కూడా వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. దీంతో కడప జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ అయిన పరిస్థితి కనబడుతోంది.
(టీడీపీకి సతీష్‌రెడ్డి రాజీనామా)