బాబు మాకు అన్యాయం చేశాడు: రామసుబ్బారెడ్డి | Former MP Rama Subbareddy Talks In Press Meet In YSR Kadapa | Sakshi
Sakshi News home page

ఇది సీఎం జగన్‌ నైజం: రామసుబ్బారెడ్డి

Mar 12 2020 7:56 PM | Updated on Mar 12 2020 8:06 PM

Former MP Rama Subbareddy Talks In Press Meet In YSR Kadapa - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని భూములతో వ్యాపారం చేశాడని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన స్వలాభం కోసం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చంద్రబాబు చుశాడన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న తమను కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోని ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రి పదవులు కట్టబెట్టి తమకు, తమ కుటుంబాలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కాగా ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పార్టీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎదురించి సొంతంగా పార్టీ పెట్టిన నైజం ఆయనదన్నారు. తండ్రి దివంగత నేత వైఎస్సార్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను నెరవేర్చాలని, రాష్ట్రం అభివృద్ధి చేయాలని సీఎం జగన్‌ కసిగా పని చేస్తున్నారని ఆయన అన్నారు. 

వైఎస్సార్‌సీపీలోకి రామసుబ్బారెడ్డి కుటుంబం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement