రాయ్‌బరేలిలో సోనియా నామినేషన్‌ | Sonia Gandhi Files Nomination Papers From Rae Bareli | Sakshi
Sakshi News home page

రాయ్‌బరేలిలో సోనియా నామినేషన్‌

Apr 11 2019 2:40 PM | Updated on Apr 11 2019 2:40 PM

Sonia Gandhi Files Nomination Papers From Rae Bareli - Sakshi

రాయ్‌బరేలిలో సోనియా నామినేషన్‌

లక్నో : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికలకు రాయ్‌బరేలి నుంచి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాబర్ట్‌ వాద్రాలు వెంట రాగా రిటర్నింగ్‌ అధికారికి ఆమె తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. అంతకుముందు సోనియా రాయ్‌బరేలిలో భారీ రోడ్‌షో నిర్వహించారు.

ఇక నామినేషన్‌ దాఖలు చేసే ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాందీతో తలపడుతున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేధిలో నామినేషన్‌ దాఖలు చేశారు. అమేధిలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ సహా సీనియర్‌ బీజేపీ నేతలతో కలిసి ఆమె రోడ్‌షో నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement