ఆ ఛానెల్‌ వార్తను నమ్మొద్దు : స్టార్‌ హీరో | Sarath Kumar Denies Petrol Bomb Attack | Sakshi
Sakshi News home page

Mar 11 2018 11:30 AM | Updated on Mar 11 2018 11:30 AM

Sarath Kumar Denies Petrol Bomb Attack - Sakshi

శరత​ కుమార్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌ హీరో శరత్‌ కుమార్‌ అసత్యపు కథనాలపై స్పందించారు. తన ఇంటిపై పెట్రోల్‌ బాంబు దాడి జరిగిందంటూ ఓ ప్రముఖ ఛానెల్‌ లో వస్తున్న వార్తను ఆయన ఖండించారు. 

‘సన్‌ న్యూస్‌ ఛానెల్‌లో నా ఇంటిపై పెట్రోల్‌ బాంబు దాడి జరిగినట్లు ఫ్లాష్‌ న్యూస్‌ స్క్రోలింగ్‌ వస్తోంది. అది నిజం కాదు’ అని ఆయన కాసేపటి క్రితం ట్వీట్‌ చేశారు. కాగా, గతంలో డీఎంకే పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన.. కరుణానిధి కుటుంబంతో విభేధాల కారణంగా 2006లో పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ప్రస్తుతం అఖిల భారతీయ సమతువా మక్కల్‌ అనే రాజకీయ పార్టీతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement