మోదీ ఓ ఎద్దు.. స్మృతి బలిష్టమైన ఆవు

RLD leader Ajit Singh has commented on Prime Minister Narendra Modi and Smriti Irani. - Sakshi

ఆర్‌ఎల్డీ అధినేత అజిత్‌సింగ్‌ నోటి దురుసు

మథుర: రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్డీ) అధినేత అజిత్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని ఆయన ఎద్దు–దూడ–బలిష్టమైన ఆవుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లోని కోసీకలాన్‌లో రైతులతో చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘తప్పుడు వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటే ఐదేళ్ల తర్వాత మార్చగలిగే హక్కు ప్రజలకు ఉండటం నిజంగా ప్రజాస్వామ్యం గొప్పతనమే. మీ ఆవులు, ఎద్దులు, దూడలు ఈ మధ్య విచ్చలవిడిగా తిరుగుతున్నాయని వార్తాపత్రికల్లో చూస్తున్నాను. వాటిని మీరు స్కూళ్లు, కాలేజీ భవనాల్లో కట్టేస్తున్నారు. ప్రజలేమో వాటిని మోదీ–యోగి అని పిలుస్తున్నారు. మరికొందరేమో బాగా బలిష్టమైన ఆవు ఒకటి వచ్చిందని చెబుతున్నారు. స్మృతీ ఇరానీ కూడా ఈ మధ్య బాగా తిరుగుతున్నారు’ అని అజిత్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top