‘చంద్రబాబు వల్లే కోడెల మృతి’

RK Roja Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు పెట్టిన అవమానాలతోనే మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణించారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎక్కడా ఉద్దేశ్యపూర్వకంగా కోడెలపై కేసులు పెట్టలేదన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా కోడెలకు చంద్రబాబు  కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నామన్నారు. వర్ల రామయ్య లాంటి వ్యక్తులు కోడెలను దూషించడం వెనుక చంద్రబాబు పాత్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సొంత మామ ఎన్టీఆర్‌, రంగా లాంటి వ్యక్తుల మరణం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని అందరికి తెలిసిన విషయమేనని రోజా విమర్శించారు.

చదవండి : 

కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి

కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి

కోడెల మృతిపై కేసు నమోదు

కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?

కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?

సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!

కోడెల శివప్రసాదరావు కన్నుమూత

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top