అసెంబ్లీలో రెడ్లదే రాజ్యం | Reddy Candidates is many into new assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో రెడ్లదే రాజ్యం

Dec 12 2018 5:28 AM | Updated on Dec 12 2018 5:28 AM

Reddy Candidates is many into new assembly - Sakshi

కొత్త అసెంబ్లీకి ఎన్నికైన వారిలో అగ్రకులంలోని రెడ్ల హవా కొనసాగింది.ప్రధాన పార్టీలు కూడా వారికే ప్రాధాన్యం ఇవ్వడంతో అత్యధికంగా ఆ సామాజిక వర్గానికి చెందిన వారు 39 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరి తర్వాత అధికంగా 10 మంది వెలమలు గెలిచారు. బ్రాహ్మణ, వైశ్య వంటి వారిని కలిపి మొత్తం అగ్రకులాలకు చెందిన ఎమ్మెల్యేలు 52 మంది ఉన్నారు. బీసీలు అందరూ కలిపి 23 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఎక్కువగా మున్నూరు కాపులు తొమ్మిది మంది ఉండగా, యాదవులు ఐదుగురు, గౌడలు నలుగురు ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో మాల, మాదిగలు చెరో తొమ్మిది స్థానాలు గెలువగా, నేతకాని వర్గం నుంచి ఒకరు గెలుపొందారు. ముస్లింలు ఎనిమిది స్థానాల్లో గెలవగా, ఇందులో ఏడుగురు ఎంఐఎం తరఫున గెలిచిన వారే ఉండగా, బోధన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన షకీల్‌ విజయం సాధించారు.  
– సాక్షి, హైదరాబాద్‌ 

Advertisement
 
Advertisement
Advertisement