‘రాహుల్‌ శివభక్తుడైతే.. క్షమాపణ చెప్పాలి’

Ravi Shankar Prasad Response On Shashi Tharoor Comments - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఘూటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తక్షణమే స్పందించి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ తనను తాను శివభక్తుడిగా చెప్పకుంటారని అన్నారు. కానీ ఆయన పార్టీకి చెందిన నేతలు మహాదేవుని ప్రతిష్టను దెబ్బతిసేలా వ్యవహారిస్తారని ఎద్దేవా చేశారు. ఎవరో చెప్పారని.. మోదీపై నిందలు మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప శివభక్తుడిగా చెప్పుకునే రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు. శివలింగంపై థరూర్‌ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

కాగా, శనివారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్‌ మాట్లాడుతూ.. మోదీ శివలింగంపై కూర్చున్న తేలు వంటి వారని, ఆయనను చేతితో తొలగించలేరని, చెప్పుతో కొట్టలేరని ఓ ఆరెస్సెస్‌ నేత ఓ జర్నలిస్టుతో చెప్పినట్టు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: ‘మోదీ శివలింగంపై కూర్చున్న తేలు వంటి వారు’ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top