కేసీఆర్‌కు గిరిజనులే బుద్ధి చెబుతారు | Ramulu naik commented over kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు గిరిజనులే బుద్ధి చెబుతారు

Oct 23 2018 2:02 AM | Updated on Oct 23 2018 2:02 AM

Ramulu naik commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని, కేసీఆర్‌కు గిరిజనులే బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ రాములు నాయక్‌ అన్నారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఏడు కోట్ల రూపాయలను ముందే పంపించారని ఆరోపించారు.

రాములునాయక్‌ సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ ద్రోహులను వెంటేసుకుని తిరగడం సరైంది కాదని చెప్పినందుకే నన్ను టీఆర్‌ఎస్‌ నుంచి తప్పించా రు. కేసీఆర్‌ కుటుంబానికి గిరిజనులు, దళితుల గురించి మాట్లాడే హక్కు లేదు. కేటీఆర్‌ అంబేడ్కర్‌ గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు. దేశంకోసం ప్రాణత్యాగం చేసిన దళిత నాయకుల వేడుకల్లో సీఎం ఎప్పుడైనా పాల్గొన్నారా? నాలుగేళ్లలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలో పాల్గొనలేదు’ అని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement