రాహుల్‌ గాంధీ వీడియోపై దుమారం

Rahul Gandhi Singapore Video Creates Controversy - Sakshi

సాక్షి, ముంబై : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది. యూపీఏ పాలనలో ఆర్థిక రేటు ఎందుకు పడిపోయిందన్న ప్రశ్నకు సమాధానమివ్వని రాహుల్‌.. తర్వాత మరో వ్యక్తి అడిగిన ప్రశ్నకు బదులివ్వటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రాహుల్‌ సింగపూర్‌, మలేషియాలో మూడు రోజుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే(మార్చి 8-10వ తేదీ వరకు). తాజాగా సింగపూర్‌ జాతీయ యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి హాజరైన రాహుల్‌ ప్రసంగించారు. ఆపై సభికులు అడిగిన ప్రశ్నలకు రాహుల్‌ సమాధానమిచ్చారు. అంతలో ఓ ఫ్రొఫెసర్‌ కాంగ్రెస్‌ హయాంలో(రాహుల్‌ గాంధీ కుటుంబ పాలనలో..) దేశ ఆర్థిక రేటు కనిష్టానికి పడిపోయిందని.. కానీ, అధికారం కోల్పోయిన సమయంలో ఒక్కసారిగా పైకి లేచిందని, దానికి కారణాలు చెప్పాలంటూ కోరాడు. 

అయితే ఆ ప్రశ్నకు సమాధానం దాట వేసిన రాహుల్‌.. తర్వాత కాంగ్రెస్‌ పాలనను పొగిడిన వ్యక్తికి ఉత్సాహంగా బదులిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ వీడియోను తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. కానీ, అక్కడ జరిగింది ఒకటి అయితే ఈ వీడియోను కాంగ్రెస్‌ మార్చేసి మరోలా మార్చేసిందని ఆ ఫ్రొఫెసర్‌ చెబుతున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలని.. లేని పక్షంలో రాహుల్‌ పై కేసు వేస్తానని అతను అంటున్నాడు. ఇక కాంగ్రెస్‌ వ్యతిరేకులు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top