
ఎవరైతే అమరావతి కోసం ఉద్యమించారో.. త్వరలోనే వారిలో అధిక శాతం వెనకడుగు వేస్తారు.
సాక్షి, తూర్పుగోదావరి/కాకినాడ : పుదుచ్చేరి వైద్యారోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న భావన వైఎస్ జగన్‌లో ఉందన్నారు. ‘నా రాజకీయ జీవితంలో కేబినెట్ ప్రమాణస్వీకారం చేయకుండానే పథకాలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే’అని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో అధికార వికేంద్రీకరణను కొంతమంది వ్యతిరేకించినప్పటికీ.. రాబోయే పదేళ్లలో దాని ప్రతిఫలాలను అందుకున్నప్పుడు సీఎం తీసుకున్న నిర్ణయం సరైనదని భావిస్తారని కృష్ణారావు అన్నారు. ఆయన కాకినాడలో మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ..
తండ్రిలాగానే తనయుడు..
‘రాజధానులు ఏర్పటయ్యే మూడు ప్రాంతాలతో పాటు అన్ని జిల్లాలను సీఎం జగన్ అభివృద్ధి చేస్తారనే నమ్మకం నాకుంది. గత ప్రభుత్వం చెప్పినట్లు అమరావతి రెండో హైదరాబాద్ అవుతుందని రైతులు భ్రమ పడుతున్నారు. 29 వేల మంది రైతులు తమ భూములను త్యాగం చేయడం ఎక్కడా చూడలేదు. అమరావతి రైతులకు ప్రతిఫలం రెట్టింపుగా ఇవ్వడం చూస్తే.. మహానేత వైఎస్సార్‌కు ఏవిధంగా రైతులపై ప్రేమ ఉండేదో సీఎం జగన్‌కు అదే ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఎవరైతే అమరావతి కోసం ఉద్యమించారో.. త్వరలోనే వారిలో అధిక శాతం వెనకడుగు వేస్తారు. అమరావతి మరో హైదరాబాద్ కాకుడదని నా భావన. ఏపీలో అమలవుతున్న పథకాలు చూసి తమిళనాడు... పాండిచ్చేరి ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌ను హీరోగా చూస్తున్నారు’అని కృష్ణారావు అన్నారు.
(చదవండి : పుదుచ్చేరి మంత్రి మల్లాడికి సీఎం జగన్ పరామర్శ)