ప్రియాంకకు ‘చౌకీదార్‌’ అర్థం తెలియదు

Priyanka Gandhi does not know meaning of chowkidar - Sakshi

ఉమా భారతి ఎద్దేవా

ముజఫర్‌నగర్‌: బీజేపీ ఉపాధ్య క్షురాలిగా ఇటీవల నియమించబడిన సీనియర్‌ నేత ఉమాభారతి కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ వాద్రాపై విరుచుకుపడ్డారు. ఆమెకు చౌకీదార్‌ (కాపలాదారు) అర్థమే తెలియదని విమర్శించారు. బీజేపీ చౌకీదార్లు కేవలం ధనవంతుల కోసమే పనిచేస్తున్నారన్న ప్రియాంక వ్యాఖ్యలపై ఉమాభారతి స్పందించారు. ప్రియాంకకి చౌకీదార్‌ అర్థం తెలియదని, గ్రామాల్లో పేదల రక్షణ కోసం నిలబడేవారిని చౌకీదార్లు అంటారని  ఆమె వివరించారు. ముజఫర్‌నగర్‌ లోక్‌సభ నియోజవకర్గంలో ఉమాభారతి ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అక్కడ సిట్టింగ్‌ ఎంపీ సంజీవ్‌ బల్యన్‌ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్‌ఎల్‌డీ, ఎస్పీ, బీఎస్పీ పొత్తులో భాగంగా ఈ స్థానంలో సంజీవ్‌ బల్యన్‌కు పోటీగా ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ అజిత్‌సింగ్‌ పోటీ చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీని ‘వికాస్‌ పురుష్‌’గా అభివర్ణించిన ఉమాభారతి, భారీ గెలుపుతో మోదీ తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top