కరుణానిధికి రాష్ట్రపతి కోవింద్‌ పరామర్శ | President Ramnath Kovind Visits Karunanidhi | Sakshi
Sakshi News home page

Aug 5 2018 4:18 PM | Updated on Aug 5 2018 7:21 PM

President Ramnath Kovind Visits Karunanidhi - Sakshi

సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం పరామర్శించారు. కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా కరుణానిధికి అందిస్తున్న వైద్యచికిత్సల గురించి స్టాలిన్‌ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి వెంట తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్, రాష్ట్ర మంత్రి జయకుమార్ ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిరోజుల కిందట కరుణానిధి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. కరుణానిధి ఆరోగ్యం కుదుటపడిందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్య వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement