సోనియా విమర్శలకు అర్థం ఉండదు కదా..

Prashant Kishor Slams Congress Leadership Regarding CAA And NRC - Sakshi

నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌(ఎన్‌ఆర్‌సీ)కి సంబంధించిన నిరసనలలో కాంగ్రెస్‌ పార్టీ పాల్గొనడం లేదని రాజకీయ వ్యూహకర్త, జేడీయు వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ ట్విటర్‌ వేదికగా శనివారం విమర్శించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ బీజేపీపై విమర్శిస్తూ చేసిన వీడియో స్టేట్‌మెంట్‌ను చూశానని అన్నారు. శుక్రవారం సీఏఏ, ఎన్ఆర్‌సీని సోనియా విమర్శిస్తూ.. బీజేపీ ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను తీసుకొచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రులు స్పందించకపోతే సోనియా గాంధీ విమర్శలకు అర్థం ఉండదని ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు.

ఇటీవలి కాలంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలలో ప్రశాంత్‌ కిషోర్‌ చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. బీజేపీ అమలు చేస్తామంటున్న ఎన్ఆర్‌సీ.. పెద్దనోట్ల రద్దు మాదిరిగానే పేదలు, దిగువ తరగతి వారికి తీవ్ర నష్టం చేయనుందని గతంలో ఆయన ట్వీట్‌ చేసిన విషయం విదితమే.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top