ప్రగతి నివేదన సభ.. ఈ ఐపీఎస్‌లకు ప్రత్యేక బాధ్యతలు

Pragati nivedana sabha.. IPS Officers gets special charge - Sakshi

సాక్షి, కొంగరకలాన్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ  ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ప్రగతి నివేదన సభ’కు ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. 20 లక్షలమందితో అత్యంత భారీగా నిర్వహించాలని భావిస్తున్న ఈ సభ భదత్ర కోసం పోలీసులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రగతి నివేదన సభ’కు ఇబ్బందులు తలెత్తకుండా పలువురు ఐపీఎస్‌ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు కేటాయించారు. 

సభ ఓవరాల్ కో ఆర్డినేటర్‌గా లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ జితేందర్‌కు బాధ్యతలు కేటాయించగా.. సభ ఇన్‌చార్జిగా రాచకొండ సీపీ మహేష్ భగవత్‌కు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా సభ సెక్యూరిటీ ఇన్‌చార్జిగా సైబరాబాద్ సీపీ సజ్జనార్, ట్రాఫిక్ ఇన్‌చార్జిలుగా ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్‌కుమార్, ఎస్పీ రంగనాథ్, సీఎం సెక్యూరిటీ, రూట్ క్లియరెన్స్ ఇన్‌చార్జిగా ఎస్పీ కోటిరెడ్డికి బాధ్యతలు పురమాయించారు. సభలోకి ప్రజలు అనుమతించే విధులకు ఇన్‌చార్జిగా వరంగల్ సీపీ రవీందర్‌ను, పబ్లిక్ కోఆర్డినేటర్లుగా డీసీపీ జానకి షర్మిల, ఎస్పీ శశిధర్‌ రాజు, సమావేశ వేదిక ఇన్‌చార్జిగా దుగ్గల్‌కు బాధ్యతలు అప్పగించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top