పరిపాలన చేయడంలో మోదీ ఫెయిల్‌.. | Ponnam Prabhakar Slams To PM Narendra Modi | Sakshi
Sakshi News home page

స్విమ్మంగ్‌ ఫుల్‌, ఏటీఎంలకు వెళ్తే జీఎస్టీ ఎందుకు..

Apr 12 2018 4:39 PM | Updated on Mar 18 2019 7:55 PM

Ponnam Prabhakar Slams To PM Narendra Modi - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల: కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు. గురువారం ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి ప్రధాన మంత్రిగా ఉండి దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అంతేకాక దేశంలో జీఎస్టీ, నోట్ల రద్దుతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. దళితులపై దాడులు పెరుగుతన్నాయని ఆయన అన్నారు. 

ప్రస్తుతం స్విమ్మంగ్‌ ఫుల్‌, ఏటీఎంలకు వెళ్తే జీఎస్టీ ఎందుకు కట్టాలని పొన్నం ప్రశ్నించారు. నాలుగు వంతుల మెజారిటీ ఉంది.. అలాంటప్పుడు పార్లమెంట్‌ను సమర్థవంతంగా నడుపలేక అవిశ్వాసం రాకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన చేయడంలో మోదీ ఫెయిల్‌ అయ్యారని పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. 

ప్రస్తుతం దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారని  ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ దీక్ష ఎందుకు.. ఫొటో పోజులకా.. లేక, దేశంలో పరిపాలన సరిగా చేయలేక ఓడిపోయానని ప్రధాన మంత్రి దీక్షలో కూర్చున్నారా అని పొన్నం ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement