మోదీ పనితీరుకు జనం జేజేలు: లక్ష్మణ్‌ | people baks modi | Sakshi
Sakshi News home page

మోదీ పనితీరుకు జనం జేజేలు: లక్ష్మణ్‌

Dec 18 2017 1:06 PM | Updated on Aug 21 2018 9:33 PM

people baks modi - Sakshi

సాక్షి, హైదరాబాద్: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఈ ఫలితాలు మోదీ నాయకత్వంలో పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. సోమవారం ఆయన ఇక‍్కడ మాట్లాడుతూ గుజరాత్‌లో బీజేపీ విజయానికి కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ ఫథకాలను బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారన్నారు.

గుజరాత్‌లో అభివృద్ధి ఎజెండానే తప్ప ఎలాంటి జిమ్మిక్కులు పనిచేయలేదని లక్ష్మణ్ అన్నారు. గుజరాత్‌లో మోదీ చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదని, గుజరాత్ తరహా పాలన దేశమంతటా వ్యాపిస్తోందన్నారు. జీఎస్టీ, పెద్దనోట్లపై కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. రాహుల్ గాంధీ గాలిలో తిరిగి చెప్పిన గాలి మాటలు గాలిలోనే కొట్టుకుపోయాయని ఆయన విమర్శించారు. భవిష్యత్‌లో బీజేపీ తెలంగాణలో పాగా వేస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement