చంద్రబాబు పబ్లిసిటీపై పవన్‌ ఫైర్‌ | Pawan Kalyan Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Nov 12 2018 10:22 AM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan Slams Chandrababu Naidu  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిత్లీ తుఫాన్‌ సహాయాన్ని కూడా ప్రచారం కోసం వాడుకుంటున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డారు. తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసింది గింజంతా., కానీ ప్రచారం మాత్రం ఎవరెస్ట్‌ రేంజ్‌లో ఉందని, టీడీపీ ప్రభుత్వ తీరును చూస్తే అతి ప్రచారం కొంప ముంచుతుందనే అబ్రహం లింకన్‌ కోట్‌ గుర్తుకు వస్తుందని ట్వీట్‌ చేశారు. ఇక మరో ట్వీట్‌లో జనసేన నాయకులెవరు తన పేరిట కానీ పార్టీ పేరిట కానీ కార్తీక మాసం వనభోజనాలు జరపవద్దని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement