
సాక్షి, నరసాపురం : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నారు. తీవ్ర ఎండలు, వేడికారణంగా అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు చెప్పారు. మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినా జననేత బుధవారం పాదయాత్ర కొనసాగించారు.
వైద్యుల సూచన, పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు రేపు(గురువారం) పాదయాత్రకు విరామం ఇచ్చేందుకు వైఎస్ జగన్ అంగీకరించారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం చెప్పారు. గురువారం ప్రజాసంకల్పయాత్ర ఉండదని, శుక్రవారం పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుందని రఘురాం వెల్లడించారు.