సాక్షి, పశ్చిమగోదావరి: టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. యాదవులపై కూటమి ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ చేస్తోందంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన తణుకులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యాదవులకు వైఎస్ జగన్ మేలు చేశారని.. చంద్రబాబు ఏం చేశారంటూ ప్రశ్నించారు.
‘‘తిరుమలలో గొల్ల మండపాన్ని కూల్చింది చంద్రబాబే. తిరుమలలో యాదవులకు వంశపారపర్య హక్కును తిరిగి తీసుకొచ్చింది జగనే. శ్రీకాకుళం చరిత్రలో యాదవులకు ఎమ్మెల్సీ ఇచ్చింది వైఎస్ జగనే. విశాఖలో యాదవ మహిళ అని కూడా చూడకుండా మేయర్ పదవి నుంచి దించేశారు’’ అంటూ కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.


